కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలు సాధించాలి
సిపిఎం నాయకులు
గరిడేపల్లి, మే 19 : కమ్యూనిస్టు ఉద్యమానికి ఊపిరి పోసిన స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను సాధించాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల సైదయ్య, సుందరి వీరరాఘవయ్య అన్నారు. మండలంలోని కీతవారిగూడెం, గరిడేపల్లిలో మంగళవారం స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య 41 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ పేదల పక్షాన నిలిచాడు అని అన్నారు.
కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ తన పేరులో ఉన్న రెడ్డి అనే కులం పేరును తొలగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు.దక్షిణ భారతదేశంలోని కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు.మొదట ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బొల్లేపల్లి శ్రీనివాస్, జుట్టు కొండ మట్టయ్య, ఆవుల సైదులు, తుమ్మల వెంకటేశ్వర్లు, సుందరి సత్యనారాయణ, జుట్టు కుండ శ్రీనివాస్, బంగారు శ్రీనివాస్, పాలేల్లి జంగయ్య, భూతం నాగరాజు, జుట్టుకొండ శ్రీనివాస్, దొంత గాని లక్ష్మయ్య, కొండ నరసయ్య, జుట్టుకొండ లక్ష్మమ్మ, ఇనుగుర్తి ధనలక్ష్మి, భూతం సరిత, ఎల్లావుల పిచ్చమ్మ, చనగాని వెంకట నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.






