26 July, 2026 | 2:13 AM

బీజేపీ పతనానికి తొలిమెట్టు

26-07-2026 12:13 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనా మా విద్యార్థులు, ఉద్యమకారుల విజయం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది అప్రజాస్వామ్యం మీద గెలుపు అని వ్యాఖ్యానించారు. ఈ రోజు దిగి వచ్చిన ప్రభుత్వం రేపు గద్దె దిగడం కూడా తప్పదని స్పష్టం చే శారు.

రాహుల్ గాంధీ పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశవ్యాప్తంగా ఐక్యతతో కేంద్రం దిగివచ్చిందన్నారు. భవిష్యత్‌లో విద్యార్థుల జీవి తాలతో చెలగాటం ఆడవద్దనే గుణపాఠం ప్రభు త్వానికి వచ్చిందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా బీజేపీ ప్రభు త్వ పతనానికి తొలిమెట్టు అని అన్నారు. ఇలాంటి ప్రజావ్యతిరేక ఉద్యమాల్లో తప్పకుండా కలిసి పోరాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.