calender_icon.png 6 December, 2024 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల వ్యాన్ బోల్తా.. ఎగబడిన జనం

25-09-2024 01:03:35 AM

పట్టుకున్నవారికి పట్టుకున్నన్ని !

మహబూబాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): చేపల లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడటంతో చేపల కోసం జనాలు ఎగబడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరెపెడ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఖమ్మం నుంచి వరంగల్‌కు చేపల లోడుతో వెళ్తున్న వ్యాన్ మరిపెడ మండల కేంద్రంలో బోల్తాపడింది.

ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా చేపలన్నీ కుప్పలుగా రోడ్డుపై పడిపోయాయి. అవి బతికున్న చేపలు కావడంతో జనాలు ఎగబడి అందినకాడికి పట్టుకపోయారు. పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకుని జనాన్ని అదుపు చేయాల్సి వచ్చింది.