07-08-2025 12:35:58 AM
డీటీవో టి.వెంకటేశ్వర రావు
అలంపూర్ ఆగస్టు 06బస్సుల ఫిట్నెస్ బాధ్యత స్కూల్ యాజమాన్యాలదేనని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు.బస్సులను ఫి ట్నెస్ ఉంచడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని దీంతో పలు ప్రమాదంలో చోటు చే సుకుంటున్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో బుధవారం బస్సుల ఫిట్నెస్ పై పాఠశాలల యాజ మాన్యాలు ,డ్రైవర్లకు ఆర్టీవో అధికారులు అవగాహన కల్పించారు.బస్సులను తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవలన్నారు.
కొందరు నిబంధనలకు విరుద్ధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దీంతో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తామని తెలిపారు.విద్యాసంస్థల బస్సులను నిరంతరం తనిఖీలు చేస్తామన్నారు.నింబంధనలు అతిక్రమించిన బస్సులను వెంటనే సీజ్ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.స్కూల్ బస్సుల విషయంలో యాజమాన్యాలే పూర్తి బాధ్యత తీసుకోవాలని తెలిపారు.
కండీషన్లో ఉన్న బస్సులను ఏర్పాటు చేసుకోవాలని నిష్ణాతులైన డ్రైవర్లనే ఎంపిక చేయాలని తెలిపారు. తప్పకుండా ఫిట్నెస్ పత్రాలు ఉండాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు.