07-08-2025 12:36:25 AM
నంగునూరు, ఆగస్టు 6: నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని మనస్థాపానికి గురైన వార్దోల్ శ్రీకాంత్ యాదవ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామంలోని బస్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ శ్రీకాంత్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకోనీ, కొంత తాగడానికి ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు అతన్ని నిలువరించారు.
వెంటనే శ్రీకాంత్ ను ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న తహసిల్దార్ సరిత శ్రీకాంత్ తో మాట్లాడి అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని హామీ ఇచ్చారు.