4 July, 2026 | 11:16 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఫుడ్ పాయిజన్ ఘటన బాధాకరం

04-06-2025 11:57 PM

పాలనలో ఫుడ్‌పాయిజన్లు, ప్రాణాలు కోల్పోవడం సాధారణమైంది..

హరీశ్‌రావు..

హైదరాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఒకేసారి 70 మంది ఫుడ్‌పాయిజన్‌కు గురికావడం, అందులో ఒకరు మృతి చెందడం అత్యంత బాధాకరమని మాజీమంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఎక్స్‌లో ఆయన స్పందించారు. విద్యార్థులు చదువుకునే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, వైద్యం కోసం వచ్చే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పాలనలో ఫుడ్ పాయిజన్లు జరగడం, ప్రాణాలు కోల్పోవడం అత్యంత సాధారణమైపోయిందని మండిపడ్డారు. మానసిక వైద్యం పొందేందుకు ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు కూడా నాణ్యమైన భోజనం పెట్టలేని దిక్కుమాలిన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నట్టు? ఆరోగ్య శాఖ  ఏం చేస్తున్నట్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో క్లిష్టపరిస్థితుల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులతో పాటు, మిగతా 67మందికి నాణ్యమైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.