10-11-2025 12:00:00 AM
ములకలపల్లి, నవంబర్ 9, (విజయక్రాంతి):కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం మండలంలోని తాళ్లపాయ దేవాలయ సమీపంలో ములకలపల్లి లోని విశ్వ బ్రాహ్మణులు వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుదీర్ఘకా లం తర్వాత విశ్వబ్రాహ్మణులు, యువత ఆధ్వర్యంలో కార్తీకమాస వన సమారాధన కార్యక్రమం జరిగింది. విశ్వబ్రాహ్మణులు కు టుంబ సమేతంగా పాల్గొని సామూహిక వనభోజనాలను నిర్వహించారు.
ఆటపాటలతో కార్యక్రమంలో చిన్న,పెద్ద అందరూ ఉ త్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు జరిగిన సమావేశంలో తాళ్లపాయ పోస్టల్ బ్రాంచి పోస్టుమాస్టర్ శ్రీదీరాల బాల గంగాధర తిలక్ మాట్లాడుతూవనసమారాధన, సామూహిక వనభోజనాల ద్వారా కుటుంబ సభ్యులంతా ఒక దగ్గర కలుసుకోవడంతోపాటు, గ్రామాలు, పట్టణాల్లో నివా సం ఉంటున్న కుటుంబాల మధ్య పరిచయాలు ఏర్పడతాయని, స్నేహ సంబంధాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాముల జగదీష్, దాగం శ్రీని వాసరావు,కె.సంజీవ చారి,రాఘవాచారి, ని రంజన్ రాఘవాచారి, స్వామి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.