10-11-2025 12:00:00 AM
ఆదివారం ఏకంగా ఎన్నుకున్న వ్యాపారస్తులు
భద్రాచలం, నవంబర్ 9, (విజయక్రాంతి)భద్రాచలం క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం భద్రాచలంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ భద్రాచలం కమిటీ అధ్యక్షులుగా దొడ్డిపట్ల కోటేష్, కార్యదర్శిగా గుడుమాసు ప్రసాద్, కోశాధికారిగా దోడిపట్ల శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు దోడిపట్ల కోటేష్ గారు మాట్లాడుతూ ఎన్నికను ఏకగ్రీవంగా జరిపించినటువంటి పాత కమిటీ సభ్యులకు, అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ లోని ఏ ఒక్కరికి సమస్య వచ్చిన ముందుండి పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని, భద్రాచలంలోని వస్త్ర వ్యాపారలను మెరుగుపరిచేందుకు కమిటీ సభ్యుల సూచనలు మేరకు మంచి ఆలోచన నిర్ణయాలు తీసుకుంటానని, అసోసియేషన్ సభ్యులందరూ కలిసి తనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం క్లాత్ & రెడీమేడ్ అసోసియేషన్ లోని సభ్యులందరూ పాల్గొన్నారు.