16 July, 2026 | 4:46 AM

స్వరాష్ట్ర ఆవిర్భావానికి పునాది

09-12-2024 12:00 AM

2009 డిసెంబర్ 9: డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో ప్రత్యేకమైన రోజు.  స్వరాష్ట్ర ఆవిర్భావానికి పునాది పడిన రోజు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు. అస్తిత్వానికి, ఉద్యమానికి గుర్తింపు లభించిన రోజు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని పిడికిలి బిగించి 11 రోజుల ఆమరణ దీక్ష చేపట్టాడు కేసీఆర్. సరిగ్గా ఇదే సమయంలో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్టు ప్రకటించారు.