దిగుమతులతోనే ఇంధన సంక్షోభం
దిగుమతులపై ఆధారపడటం వల్లనే భారత్‌లో ఇంధన సంక్షోభం ఏర్పడింది. ఇంధన రంగంలో స్వయం స్వావలంబన సాధించకుండా, ఇతర దేశాలపై ఆధారపడటం వల్లనే భారత్ ఆర్థిక వ్యవస్థను తూట్లు పొడిచింది. ఈ కారణంగానే రూపాయి విలువ రోజురోజుకు మరింతగా క్షీణిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ జపాన్, బ్రిటన్‌ల కంటే వెనకబడి ప్రస్తుతం ఆరవ స్థానానికి పడిపోయింది.
పశ్చిమాసియా యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా అంచనాలు తప్పా యి. ఇరాన్‌ను చాలా తక్కువగా అంచనా వేసిన అమెరికా ఇప్పుడు ఆ యుద్ధంలో నుంచి ఎలా బయటపడాలో పాలుపోక మల్లగుల్లాలు పడుతోంది. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసు కుంటుదని, దాని వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతుందని, తన మిత్రదేశాలైన గల్ఫ్ కంట్రీస్‌పై ఇరాన్ దాడులకు దిగుతుందని అమెరికా అస్సలు ఊ హించలేదు.
పశ్చిమాసియా పోరు ఊహకందని విధంగా మలుపు తీసుకోవడం, ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటించడం, ఇరాన్ తన ఆంక్షలను బేఖాతరు చేస్తుండటంతో ఈ యుద్ధం లో అమెరికా ‘కక్కాలేక మింగలేక’ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. అందుకే తొలుత యుద్ధానికి ఏకపక్షంగా ఐదు రోజుల విరామంతో మొదలుపెట్టి రెండు వారాల తాత్కాలిక కా ల్పుల విరమణ, ఆ తర్వాత శాంతి చర్చలు విఫలమైనప్పటికీ, కాల్పుల విరమణను పొడిగించడం, ఇప్పుడు తాజాగా ఇరాన్‌ను నిలువరించేందుకు భారీగా బలగాలు, ఆయుధాలను మోహరిస్తుండటం లాంటి పరిణామాలను మనం చూస్తున్నామని చెప్పడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు.
వాస్తవానికి ఇరాన్‌పై యుద్ధం ఆరంభించిన వెంటనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అంతమొందించిన అమెరికా సంబరాలు చేసుకుంది. ఖమేనీ అంతంతో ఇరాన్ తన చేతుల్లోకి వచ్చేసిందని భ్రమపడింది. ఇరాన్‌ను తక్కువ అంచనా వేస్తున్నా మని అప్పుడు అగ్రరాజ్యానికి తెలిసిరాలేదు. అందుకే కొద్ది రోజుల్లోనే యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రక టించారు. కానీ, క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధమైన పరిణామాలు జరిగాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ పోరుకు 60 రోజులు పూర్తయినా ఇప్పటికీ ముగింపు కనుచూపు మేరలో కానరావడం లేదు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అట్టర్ ఫ్లాప్ షోగా మిగి లింది. అమెరికా కాల్పుల విరమణ బూటకంగా మారింది.
ట్రంప్ మాటలు కోటలు దాటినా, ఇరాన్ విషయంలో అమెరికా తప్పటడుగులు వేసిందని యావత్ ప్రపంచ ం భావిస్తున్నది. ఇరాన్ అణు కార్యక్రమం చేపట్టిందనే ఆరోపణతో, ఆ దేశంలో యురేనియం నిల్వలుండరాదనే పట్టుదలతో ఇజ్రా యెల్‌తో కలిసి ఇరాన్‌పై దండెత్తిన అమెరికాకు శృంగభంగం తప్పలేదు. అమెరికా ఖరీ దైన ఆయుధాలను ఇరాన్ వ్యూహాత్మకంగా విధ్వంసం చేసింది.
అమెరికా ప్రజల్లోనూ, రిపబ్లిక్ పార్టీలోనూ, మిత్ర దేశాల్లోనూ ట్రంప్ పట్ల ఏహ్యభావం కలిగింది. అమెరికా ఆర్థికంగాను, ఆయుధపరంగాను భారీ మూ ల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అంతేకాదు, ట్రంప్ అహం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభానికి గురిచేసింది. సప్లయ్ చెయిన్ విచ్ఛి న్నం కారణంగా ప్రపంచ దేశాలు తీవ్రమైన చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్ర పంచ దేశాలన్నీ దుమ్మెత్తిపోయడంతో, పదవీగండం ముంచుకురావడంతో ఎలాగైనా యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ ఆరాటపడుతున్నారు.
కానీ, ఇరాన్ పలు షరతులను విధించగా, వాటిని అంగీకరించడం సాధ్యం కాకపోవడంతో ఇరాన్‌లోని నౌకాశ్రయాలను అమెరికా దిగ్బంధించింది. సీ మైన్స్ పేరుతో హోర్ముజ్ జలసంధిని అడ్డం పెట్టుకుని అమెరికాకు ఐఆర్‌జీసీ పట్టపగలే చుక్క లు చూపెడుతున్నది. ఇరాన్ ఇంతటి సాహసానికి తెగించడం వెనుక చైనా హస్తమున్న మాట కాదనలేని సత్యం. హోర్ముజ్ జలసంధిపై పూర్తి అధికారం తనకే ఉండాలని ఇరా న్ పట్టుబడుతుంటే, అందుకు అమెరికా ససేమిరా అంటున్నది. అమెరికా గనుక హో ర్ముజ్‌ను ఇరాన్‌కు వదిలేస్తే, అది ప్రత్యక్షంగా చైనాకు ఉపకరించినట్లే అవుతుంది.
చైనా చెప్పుచేతల్లో నడుస్తున్న ఐఆర్‌జీసీ కచ్చితంగా హోర్ముజ్‌ను పరోక్షంగా చైనా చేతు ల్లో పెట్టదనే గ్యారెంటీ లేదు. దీని వల్ల భారత్‌కు తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాద ముంది. భారత్ ఆర్థికంగా మరింతగా దెబ్బతినే అవకాశాలున్నాయి. హోర్ముజ్ జల సంధి ద్వారా భారత్‌కు 50 శాతానికి పైగా ముడిచమురు, ఎల్‌ఎన్జీ హోర్ముజ్ ద్వారా దిగుమతి కావడమే ఇందుకు కారణం. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు గల హోర్ము జ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాను దిగ్బంధనం చేసింది. ఈ నేపథ్యంలో ఇం ధన సంక్షోభం భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపెడుతున్నది.
ఒకప్పుడు ఇరాన్ నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే భారత్‌ను అమెరికా కట్టడి చేసింది. రష్యా నుంచి చము రు కొనుగోలును ఆపాలని కూడా భారత్‌పై అమెరికా ఒత్తిడి చేసింది. ట్రంప్ ఆజ్ఞలను శిరసావహించి భారత్ ఏరికోరి కష్టాలను కొనితెచ్చుకుందని చెప్పాలి. అయినప్పటికీ భారత్ పట్ల ట్రంప్ సానుకూల దక్పథం ప్రదర్శించకుండా తూలనాడటం ఆక్షేపణీ యం. ట్రంప్ తెంపరితనం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. రష్యా మధ్య యుద్ధం ఐదోవ సంవత్సరంలోకి ప్రవేశించింది.
ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు గత కొన్నేళ్లుగా ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నా, భారత్‌కు రష్యా భారీగా చమురు సరఫరా చేసి కష్టకాలంలో అండగా నిలబడింది. రష్యాపై అక్కసుతో భారత్‌ను అమెరికా కట్టడి చేస్తూ, తన అనుమతితోనే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవాలని హుకుం జారీచేయడం తీవ్ర అభ్యంతరకరం. ఇప్పటికే మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, వాహనదారులు డీజిల్, పెట్రోల్ కొరతతో మం డుటెండల్లో పెట్రోల్ బంకుల వద్ద క్యూలో నిలబడుతూ, తీవ్ర అవస్థలు పడుతున్నారు.
గ్యాస్ కొరతతో పట్టణాలు, పల్లెల్లో చాలా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు మూతబడ్డాయి. పలుచోట్ల కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. ఎందుకీ దురవస్థ? దిగుమతులపై ఆధారపడటం వల్లనే భారత్‌లో ఇంధన సంక్షోభం ఏర్పడింది. ఇంధన రంగంలో స్వయం స్వావలంబన సాధించకుండా, ఇతర దేశాలపై ఆధారపడటం వల్లనే భారత్ ఆర్థిక వ్యవస్థను తూట్లు పొడిచింది. ఈ కారణంగానే రూపాయి విలువ రోజురోజుకు మరింతగా క్షీణిస్తోంది.
ఇప్పటి వరకు ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ జపాన్, బ్రిటన్‌ల కంటే వెనకబడి ప్రస్తుతం ఆరవ స్థానానికి పడిపోయింది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశంలో ద్రవ్యోల్బణ సమస్య తీవ్రం కావచ్చు. నిత్యావసర వస్తువుల ధర లు ఆకాశాన్నంటే ప్రమాదం లేకపోలేదు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని, దళారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలు మెం డుగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత లేకపోయినా, ఇంధన ధరలు పెరుగుతాయనే కార ణంతో ప్రజలు అవసరానికి మించి చమురు కొనుగోలు చేస్తున్నారు.
కొంతమంది ఆయిల్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఆయిల్ బంకుల డీలర్లకు క్రెడిట్ సదుపాయం లేకపోవడం, ధరలు పెరుగుతాయనే కారణం తో ఆయిల్ కంపెనీలు సరఫరాను నిలిపివేయడం కూడా ప్రస్తుత ఇంధన సంక్షోభానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ భారత్ ఇంధన రంగంలో స్వ యంసమృద్ధి సాధించాల్సిన అవసరం ఎం తైనా ఉంది. సౌర విద్యుత్తును మరింత ప్రోత్సహించాలి. ఇథనాల్ ఆధారిత వాహనాలను యుద్ధ ప్రాతిపదికన మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలి. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలి. గ్యాస్ స్థానంలో ప్రత్యామ్నాయ పద్ధతులను ఆచరణలోకి తీసుకురావాలి. తద్వారా భారత్ స్వావలంబన దిశగా అడుగులు వేయాలి.
వ్యాసకర్త: సామాజిక విశ్లేషకులు, 9704903463
సుంకవల్లి సత్తిరాజు






