8 July, 2026 | 7:29 PM

తెలంగాణలో భవిష్యత్తు మాదే

11-06-2024 12:26 AM

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ 

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): తెలంగాణలో బీజేపీకి అద్భుత భవిష్యత్తు ఉండబోతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి మోదీ భారీగా నిధులు ఇచ్చారని చెప్పారు. అందుకే తెలంగాణ లో 4 పార్లమెంట్ స్థానాల నుంచి రెట్టింపు స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నదని తెలిపారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమేనని వెల్లడించారు. తెలంగాణకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.