8 July, 2026 | 8:01 PM

Breaking News

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •  

ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి

08-07-2026 07:08 PM

రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ కమిషనర్  శివకుమార్ నాయుడు

సిద్దిపేట కలెక్టరేట్: జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కె. హైమావతితో కలిసి ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలో చేర్యాల, కొమురవెల్లి, కొండపాక, మద్దూర్, ధూల్మిట్ట మండలాల్లో తపాస్‌పల్లి రిజర్వాయర్ డిస్ట్రిబ్యూటరీ కాలువలు, గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి అవసరమైన పెండింగ్  భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని, మల్లన్నసాగర్ నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న ఆర్ అండ్ ఆర్ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవోలు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.