కేటీఆర్‌కు షాక్ !
11-06-2024 12:27 AM
పార్టీ పదవికి అధినేత కేసీఆర్ చెక్
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా హరీశ్‌రావు?
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నిక ల్లో ఘోర పరాజయం చవిచూసింది. ఈ క్రమంలో పార్టీ అధినేత కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి కేటీఆర్‌ను తొలగించి హరీశ్‌రావుకు అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే హరీశ్ ఇందుకు సానుకూలంగా లేనట్టు తెలుస్తోంది. పార్టీలో సీనియర్లకు ఈ బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ఒంటెత్తు పోకడలు, కిందిస్థాయి నాయకులను పట్టించుకోక పోవడం వంటి విషయాలపై ఫిర్యాదులు అందడంతో కేసీఆర్ పునరా లోచనలో పడ్డట్టు తెలుస్తుంది.






