17 April, 2026 | 9:27 PM

విద్యతోనే భవిష్యత్తు

10-06-2025 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్9 (విజయక్రాంతి): విద్యతోనే భవిష్యత్తు  మెరుగు పడుతుందని ఏటీడీవో చిరంజీవి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆసిఫాబాద్ మండలం మాదిగల ఆశ్రమ పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ని పలు గ్రామాలలో ఇంటింటికీ వెళ్లి విద్యపై అవగాహన కల్పించారు.

సందర్భంగా ఆయ న మాట్లాడుతూ బడి బయట పిల్లలను తప్పకుండా ఆశ్రమ పాఠశాలలో చేర్పించాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఇంగ్లీష్ బోధన చేయడం జరుగుతుందని దీంతోపాటు భోజన వసతి కల్పిం చడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు, విశ్వేశ్వర్ గ్రామస్తులు పాల్గొన్నారు.