27 June, 2026 | 7:47 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

విద్యార్థుల భవిష్యత్తు దేశ భవిష్యత్తు

20-02-2026 01:53 AM
  1. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

స్కూల్ విద్యార్థులకు షూస్ డొనేట్ చేసిన  ఎమ్మెల్యే సతీమణి 

విద్యార్థినికి తానే స్వయంగా షూ తొడిగించి లేస్ కట్టిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  

బిచ్కుంద, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తు దేశ భవిష్యత్తు అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం  కౌలాస్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించిన విద్యార్థుల షూ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మెల్యే మాట్లాడారు.  ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే  సతీమణి తోట అర్చన ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు అవసరమైన షూస్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ తానే స్వయంగా విద్యార్థినికి షూ తొడిగించి లేస్ కట్టి అందరి హృదయాలను గెలుచుకొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని, చిన్నపిల్లల అవసరాలను గుర్తించి వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం విద్యతో పాటు పిల్లల మౌలిక అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూసి స్థానికులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు కూడా కొనసాగిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.