20-02-2026 01:54:49 AM
అయిజ ఫిబ్రవరి 19:అయిజ పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన కర్తవ్యమని నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ పేర్కొన్నారు గురువారం మున్సిపల్ కార్యాలయంల వైస్ చైర్మన్ , కౌన్సిలర్లతో కలిసి చైర్మన్ చాంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టా రు. అంతకుముందు పురోహితులు పూర్ణకుంభంతో నూతనంగా ఎన్నికైన చైర్మన్ ,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లను ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ... పట్టణాభివృద్ధి ధ్యేయంగా తాను పనిచేస్తానని ప్రజలు తమకు ఇచ్చిన ఈ గౌ రవాన్ని వమ్ము చేయకుండా వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటూ వారికి సాయం స హకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప ట్టణ అభివృద్ధికై రాజకీయాలను పక్కన పెట్టి తనతో ప్రజా ప్రతినిధులు ప్రజలు కలిసి రా వాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాల నరసింహులు, మున్సిపల్ కమిషనర్ సైదులు, మేనేజర్ అశోక్ రెడ్డి, మరియు ఆయా వార్డుల కౌన్సిలర్ మున్సిపల్ సిబ్బంది బిఆర్‌ఎస్ నాయకులు కార్య కర్తలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.