calender_icon.png 26 May, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు పట్టిన దెయ్యం కేటీఆరే!

25-05-2025 01:11:43 AM

-టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): కేసీఆర్‌కి పట్టిన దెయ్యం కేటీఆరే అని ఎమ్మెల్సీ కవిత చెప్పకనే చెప్పారని, కేటీఆర్‌కు అధికార దెయ్యం పట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ విమర్శించారు. కవిత ఇచ్చిన ఝలక్ తో కేటీఆర్‌కి మతి భ్రమించి సీఎం రేవంత్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

కాళేశ్వరం స్కామ్‌లో కేసీఆర్‌కు, హరీశ్‌రావుకు నోటీసులు అందడంతో కేటీఆర్ షాక్‌కు గురయ్యారన్నారు. అధికార దెయ్యం పట్టిన కేటీఆర్..అవినీతిపై మాట్లాడటం వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. బీ ఆర్‌ఎస్ మూడు ముక్కలాటలో ఒక ము క్క అయిన కవిత విడిపోవడం ఖాయమని శనివారం ఓ ప్రకటనలో తెలిపా రు.

బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య మైత్రి ఉం దన్న విషయం కవిత లేఖతో స్పష్టమైందన్నారు. లిక్కర్ స్కాంలో కవితను బెయిల్ కోసం బీజేపీ కాళ్లు పట్టుకుంది ఎవరో కేటీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ ఈడీ కేసు బీజేపీ కక్షపూరితంగా కాంగ్రెస్‌పై సృష్టించిన కేసు అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సొంత పత్రికకు ఆ పార్టీ వారు నిధులివ్వడం అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నించారు.