28 June, 2026 | 3:10 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

బాలికల ఉన్నత పాఠశాలను అక్కడే కొనసాగించాలి

14-06-2025 12:27 AM

ధర్నా చేసిన విద్యార్థుల తల్లి దండ్రులు 

కామారెడ్డి, జూన్ 13( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రం లోని జడ్.పి.హెచ్.ఎస్ బాలికల   పాఠశాలని  జడ్.పి.హెచ్.ఎస్ బాలుర పాఠశాలకు తరలించాలని అధికారులు చూస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం బిబిపేటలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న జడ్.పి.హెచ్.ఎస్ బాలికల పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం సమంజసం కాదని వారు తెలిపారు.

జడ్.పి.హెచ్.ఎస్ గరల్స్ పాఠశాల అక్కడే ఉండాలని పిల్లల తల్లిదండ్రులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. డీఈవో వెంటనే తీర్మానం రద్దుచేసి విద్యార్థుల తల్లిదండ్రులను బాధపెట్టదని ఈ సందర్భంగా వారు తెలిపారు. లేదంటే ఇంకా పెద్ద ఎత్తున ధర్నాను కొనసాగిస్తామని పిల్లల తల్లిదండ్రులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఎక్కడి పాఠశాలను అక్కడే ఉంచాలని విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని లేకుంటే అసౌకర్యానికి గురవుతారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అధికారులు ఆలోచించి విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఉన్న పాఠశాలను అక్కడే కొనసాగించాలని వారు కోరారు.