28 June, 2026 | 2:17 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందుతున్న ట్రైబల్ మ్యూజియం

14-06-2025 12:28 AM
  1. ఫీడ్ బ్యాక్ ద్వారా వివరాలు సేకరించిన ఐటీడీఏ అధికారులు 

వెల్లడించిన ఐటీడీఏ పీఓ రాహుల్

భద్రాచలం, జూన్ 13 (విజయక్రాంతి)  భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను సందర్శించడానికి పర్యాటకులతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని వర్గాల ప్రజ లు  మ్యూజియంని సందర్శించడమే కాకుండా గిరిజన వంటకాలను ఇష్టపూర్వకంగా అందరూ కలిసి ఆస్వాదిస్తున్నట్లు ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. ఐటీడీఏ యూనిట్ అధికారుల ఫీడ్ బ్యాక్ రిపోర్టు ద్వారా  తేటతెల్లమైందన్నారు.

గురువారం సాయంత్రం మ్యూజియం సందర్శనతో పాటు ప్రాంగణంలో వివిధ రకాల గిరిజన వంటల స్టాల్స్ ను సందర్శకులు వివిధ రకాల ఆహార పదార్థాలు కొనుగోలు చేసి సంతోషంగా ఆస్వాదిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు నుండి పాఠశాలలు ప్రారంభమైన, చిన్నారులతోపాటు మ్యూజియం యొక్క సందర్శకుల సంఖ్య మాత్రం తగ్గలేదని అన్నారు.

మ్యూజియమును సందర్శించే పర్యాటకులు తప్పనిసరిగా సేంద్రీయ వంటకాలతో కల్తీ లేని పుష్టికరమైన గిరిజన వంటకాలను అందించడానికి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో ఆదివాసి సాంప్రదాయ వంటకాలు, డ్రాగన్ ఫ్రూట్, ఆదివాసి బొమ్మలు, ఓనమాలు మిల్లెట్ హబ్ మరియు ఆదివాసి సత్యం సమోసా పా యింట్, దమ్మక్క, ముత్యాలమ్మ జాయింట్ లయాబిలిటీ గ్రూపు మహిళలు తయారు చేసే ఇప్ప పువ్వు, రాగి, లడ్డూలు, మామిడికాయ, కరివేపాకు, మునగ ఆకు కారంపొడి పర్యాటకులు వివిధ తినుబండారాలు కొనుగోలు చేసి వాటి యొక్క రుచిని ఆస్వాదిస్తున్నారన్నారు.

స్టాల్స్ నిర్వాహకులు స్టాల్స్ చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పర్యాటకులు కొనుగోలు చేసే తినుబండారాలను సరసమైన ధరలకు అమ్మకాలు జరపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, డీఎస్‌ఓ ప్రభాకర్ రావు, స్టాల్ ఆర్గనైజర్లు రాజేందర్, భూలక్ష్మి, సుధారాణి, వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.