calender_icon.png 17 February, 2026 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శివపార్వతుల కల్యాణం

17-02-2026 12:00:00 AM

మేళచెరువు ఫిబ్రవరి 16 :  శివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారి  కళ్యాణ మండపంపై శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని పెండ్లి కుమారునిగా అలంకరించి, అమ్మవారిని పెండ్లి కూతురుగా అలంకరించి, నూతన పట్టు వస్త్రాలను ధరించి,తలంబ్రాలు,జిలకర బెల్లం తదితర కార్యక్రమాలు అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ తంతు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బచ్చు పద్మ శ్రీనివాసరెడ్డి, ఉత్సవకమిటీ చైర్మన్ పెండ్లి లచ్చయ్య, ఈవో నాగేళ్ళ శంబిరెడ్డి,అర్చకులు కొంకపాక శివ విష్ణువర్ధన్ శర్మ, కొంకపాక ధనుంజయ శర్మ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.