calender_icon.png 17 February, 2026 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికారాబాద్ చైర్‌పర్సన్‌గా అనన్య

17-02-2026 12:00:00 AM

  1. కాంగ్రెస్ ది చీకటి రాజకీయమని ఆరోపించిన టీఆర్‌ఎస్ 

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ చైర్మన్

వికారాబాద్, ఫిబ్రవరి -16:  వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వికారాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ గా గడ్డం అనన్య ప్రమాణస్వీకారం చేశారు. వికారాబాద్ మునిసిపాలిటీలో 34 వార్డులు ఉండగా 19 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో చైర్మన్ పీఠం కాంగ్రెస్ కు దక్కింది. అనంతగిరి హరిత రిసార్ట్ నుండి నేరుగా మున్సిపల్ కార్యాలయంకు వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లు అధికారులు నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముందుగా పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్ సుధీర్ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు.  అనంతరం మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ చైర్మన్ అభ్యర్థి అనన్యను ప్రతిపాదించారు. కాంగ్రెస్ మాజీ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి బలపరిచారు. అనంతరం అర్థ సుధాకర్ రెడ్డి ని మునిసిపల్ వైస్‌చైర్మన్‌గా ఎన్నుకున్నారు. 

ఉత్కంఠగా వైస్ చైర్మన్ ఎంపిక

వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి పోటీ తీవ్రంగా ఉండడంతో పదవి ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లంక లక్ష్మీకాంత్ రెడ్డిలు వైస్ చైర్మన్ ఆశించారు. అయితే కాంగ్రెస్ హై కమాండ్ అర్థ సుధాకర్ రెడ్డికి ముగ్గు చూపడంతో ఆయనకు వైస్ చైర్మన్ పదవి దక్కింది. 

కాంగ్రెస్ ది చీకటి రాజకీయం

కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చీకటి రాజకీయం చేస్తుందని, రాజకీయ విలువలను పూర్తిగా తుంగలో తొక్కిందని టిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ఆరోపించారు. టిఆర్‌ఎస్ బీఫామ్ తో విజయం సాధించిన కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ తన కండువా కప్పి పార్టీలోకి తీసుకోవడం దారుణం అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు చూసి ప్రజలు అసహించుకుంటున్నట్లు ఆరోపించారు.

తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ ను డి ఆర్ వో మంగీలాల్  చైర్ పర్సన్ గా పట్లోళ్లని నీరాజ  రెడ్డి వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్ ను ప్రమాణస్వీకారణ చేయించారు. పరిగి లో ఆర్డీవో వాసు చంద్ర, మున్సిపల్ చైర్ పర్సన్  గా కుడుముల రజిత. వైస్ చైర్మన్ గా హనుమంతు, కొడంగల్ లో అదన కలెక్టర్ రాజేశ్వరి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్ ఎం. ప్రశాంత్ కుమార్.

వైస్ చైర్మన్గా మూడవ శంకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించి అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ల చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో వికారాబాద్ లో ఎమ్మెల్యే స్పీకర్ ప్రసాద్ కుమార్. పరిగి లో రామ్మోహన్ రెడ్డి, తాండూరు మనోహర్ రెడ్డి,ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.