17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బహుజన రాజ్యాధికారమే లక్ష్యం

21-11-2025 12:00 AM
  1. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లు చీలకుండా రాజకీయం 

రాష్ట్రీయ లోక్‌దళ్ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌదరి

బహుజనులు ఐక్యంగా ఉద్యమించాలి

ఆర్‌ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్

సరూర్‌నగర్ ఆర్‌ఎల్డీ క్యాంపు కార్యాలయంలో రెండో విడత ‘సామాజిక చైతన్య రథ యాత్ర’ ప్రారంభం

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 20 (విజయక్రాంతి)/ఎల్బీనగర్: ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యంగా, తమ ఓట్లు చీలకుండా రాజకీయం చేస్తే రాబోయే రోజుల్లో రాజ్యాధికారం దక్కుతుందని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్డీ) పార్ట జాతీయ అధ్యక్షుడు  జయంత్ చౌదరి అన్నారు. ఆర్‌ఎల్డీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక చైతన్య రథ యాత్ర రెండో విడతను ఆయన గురువారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఆర్‌ఎల్డీ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జయంత్ చౌదరి మాట్లాడు తూ.. ‘ఆర్‌ఎల్డీ పార్టీ మొదటి నుంచీ సామాజిక తెలంగాణను ఆకాంక్షించిన పార్టీ. బీసీలకు వారి జనాభా ప్రాతిపది కన చట్టబద్ధమైన రిజర్వేషన్లు దక్కాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ దళ్ తన అభ్యర్థులను నిలబెడుతుంది.

ప్రజలందరూ ‘బోర్ పంపు’ గుర్తుకు ఓటు వేసి మా అభ్యర్థులను గెలిపించి, సంపూర్ణ మద్దతు ఇవ్వాలి’ అని కోరారు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహిస్తామని, రాజ్యాధికారం కోసం బహుజనులు ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు. మొదటి దశ సామాజిక చైతన్య యాత్రలో తెలంగాణ అంతటా బీసీల్లో ఉద్యమ చైతన్యం, ఎస్సీ, ఎస్టీల్లో ఐక్యత కనిపించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఓట్లు చీలకుండా రాజకీయం చేస్తే రాబోయే రోజుల్లో రాజ్యాధికారం దక్కుతుందన్నారు.

రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణ య్య మాట్లాడుతూ.. ‘జయంత్ సింగ్ గారి తాతగారైన మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారి హయాంలోనే మండల్ కమిషన్ ఏర్పాటైంది. ఆ స్ఫూర్తితో, నేటి తరం యువకుడైన జయంత్ సింగ్ కూడా బీసీలకు చట్టబద్ధత కల్పించడం కోసం నిబద్ధతతో పోరాడాలి’ అని పిలుపునిచ్చారు. ఆర్‌ఎల్డీ జాతీయ మహిళా అధ్యక్షురాలు కపిలవాయి ఇందిరా మాట్లాడుతూ.. తమ పార్టీ యువతని రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహి స్తుందని, సామాజిక స్పృహతో రాబోయే రోజుల్లో ఈ వర్గాలకే ఎక్కువ శాతం సీట్లు కేటాయిస్తుందన్నారు.

వీజీఆర్ నారగొని మాట్లాడుతూ.. ఆర్‌ఎల్ డీ సామాజిక చైత న్యం ఉన్న పార్టీలతో త్వరలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడుతుందని, ఇందుకు కేంద్ర మంత్రి జయంత్ సింగ్ చౌదరి సహకరించాలని అందించాలని కోరారు. కార్యక్ర మంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి, హైదరాబాద్ అధ్యక్షుడు ఎంఎ స్ టైగ్, బీరప్ప (యాదాద్రి భువనగిరి అధ్యక్షుడు), ప్రధాన కార్యదర్శులు రిషబ్ విశాల్, మల్లేశ్, నరసింహారావు, సతీష్, జానీ, రాంప్రసాద్, బుల్లెట్ వెంకన్న కళా బృందం, సిద్ధం కుమార్ పాల్గొన్నారు.