21-11-2025 12:00:00 AM
జడ్చర్ల, నవంబర్ 20 : ఆ కార్యాలయంలో అతనే కింగ్ మేకర్ అంట. ఇంటి అనుమతులు కావాలన్నా.. ఆ అనుమతి పత్రాలు చేతికి చేరాలన్నా కమిషనర్ ను కలవక పోయిన పర్వాలేదు.ఆ సార్ ను మాత్రం పక్క కలవాల్సిందే అంటే ఆ సారు ప్రత్యేకత ఎంత ఉందో ఆ మున్సిపాలిటీలో ఒక్క క్షణం ఆలోచించండి. ఆ సార్ అనుకుంటే ఏ సారునైనా ఒప్పించి సాధ్యం కానీ పనులను కూడా క్షణాల్లో చేయించి మీ చేతిలో పెడతారంట.
నియమ నిబంధనలు ఎటువైపు ఉన్న అక్రమ నిర్మాణాలు ఆగాలన్న ఆ సార్ ను కలిస్తే సరిపోతుంది అంట. ఆ కార్యాలయం ఎక్కడో కాదు మహబూబ్ నగర్ జిల్లా లోని జడ్చర్ల మున్సిపల్ కార్యాలయం. అధికారులు ఎంతమంది ఉన్నా ఆ అధికారులకు బాస్ కమిషనర్ ఉన్నప్పటికీ ఆ కమిషనర్ సైతం ఆ సారు చెబితేనే చకచకా పనులు చేస్తాడంట.
ఆ కార్యాలయంలో మేనేజర్ ఉన్నట్టా..? లేనట్టా..?
జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ ఉన్నప్పటికీ ఆ పనులను మాత్రం అతని దగ్గర చేరకుండానే నేరుగా సీనియర్ అసిస్టెంట్ నుంచే కమిషనర్ టేబుల్ పైకి పోతున్నాయి. నియమ నిబంధనల ప్రకారం ఏ ఫైలు ఉన్నప్పటికీ మేనేజర్ ద్వారానే కమిషనర్ టేబుల్ పైకి పోవాల్సి ఉంటుంది. ఇవి అన్ని నిబంధనలు కాగా ఈ నిబంధనలు ఆ మున్సిపాలిటీలో అమలు జరగవంట.
ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ మేనేజర్ కంటే కిందిస్థాయి ఉన్న అధికారి మాటనే వింటారు అంట. ఇక మేనేజర్ తో పని ఏముంది. ఎవరికి ఏ పని కావాలన్నా ఎవరు ఏం చేయాలన్నా కమిషనర్ చెప్పకపోయినా పర్వాలేదు ఆ సార్ కు చెప్పి టకటక పనులు చేసుకోవచ్చంట. జడ్చర్ల మున్సిపాలిటీలో నాగర్ కర్నూల్ లో విధులు నిర్వహించాల్సిన ఆ అధికారి డిప్యూటేషన్‌పై జడ్చర్లకు వచ్చి చక్రం తిప్పుతున్నారని జడ్చర్ల మున్సి పాలిటీ ప్రజలు చెబుతున్న మాట.
నియమ నిబంధనలు ఎటువైపు ఉన్న మావైపే ప్రతి పని జరగాలని సంకల్పంతో ఆ సారు వేగంగా పరుగులు వేస్తూ ఉండడంతో కార్యాలయంలో మేనేజర్కు సైతం చేయవలసిన పనులు దూరంగా ఉండవలసిన పరిస్థితులు నెలకొన్నాయి అంటే ఆ సారు ఎంత వేగంగా పనులు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి.
ఆ డిప్యుటేషన్ అధికారే కావాలి...
జడ్చర్ల మున్సిపాలిటీలో పరిపాలన విభాగంతో పాటు ప్రతి పనిలో మరింత వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు ఆ డిప్యూటేషన్ అధికారి ఉండాలని రీజనల్ డైరెక్టర్ కి మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక లేఖ రాశారు. నాగర్ కర్నూల్ లో విధులు నిర్వహించాల్సిన ఆ అధికారికి ప్రమోషన్ వచ్చిన ఇక్కడే కొనసాగించాలని ప్రత్యేకంగా కమిషనర్ లేక రాయడంతో యధావిధిగా జడ్చర్ల మున్సిపాలిటీలోని ఆసారును కొనసాగిస్తున్నారు.
ఆ సార్ ఉన్న ఆ ప్రత్యేకతలు ఏమిటో అర్థం కాని పరిస్థితులు జడ్చర్ల మున్సిపల్ కార్యాలయ అధికారులతో పాటు ప్రజలు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నా రంట. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ని వివరణ కోరెందుకు ఫోన్ లలైన్ తోపాటు నేరుగా కార్యాలయానికి వెళ్లినప్పటికీ అందుబాటులోకి రాలేదు.