calender_icon.png 21 November, 2025 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

21-11-2025 12:00:00 AM

  1. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్

బాధిత కుటుంబాలకు కేటీఆర్, మాజీ మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పరామర్శ

ముషీరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): సౌదీ అరేబియా బస్సు ప్రమాదం బాధితుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అడిక్మెట్ లోని ఒకే కుటుంబంలో 18 మంది మరణించడం బాధాకరమని ఆయన అన్నారు.

ఈ మేరకు గురువారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్, రాంనగర్, విద్యానగర్ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం18 మంది మృతి చెందిన కుటుంబంతో పాటు ఇతర బస్సు ప్రమాద మాదిత కుటుంబాలను ఆయన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ సలీం, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నగేష్ ముదిరాజ్, యువ నాయకుడు ముఠా జై సింహలతో కలిసి ఆయన పరామర్శించారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. భారత దౌత్యధికారులతో మాట్లాడి వీలైనంత సహాయం చేస్తామని తెలిపారు. ఇంత పెద్ద దుఃఖం మరెవరికి రాకూడదని అన్నారు.

వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన ఆ భగవంతుడిని కోరుతున్నట్లు తెలిపారు. కోరారు. యాత్రికులతో వెళుతున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొ నడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గం మీడియా ఇన్ఛార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.