16 April, 2026 | 10:49 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆదివాసీల అభివృద్ధే లక్ష్యం

12-06-2025 12:46 AM

ఎస్పీ రోహిత్ రాజ్

జిల్లాలోని సరిహద్దులో ఉన్న 20 మావోయిస్టు ప్రభావిత గ్రామాలకు పోలీసుల ఆధ్వర్యంలో మినీ రైస్ మిల్లుల అందజేత

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కనీస సౌకర్యాలను అందించటమే మా లక్ష్యం

చర్ల, జూన్ 11 (విజయ క్రాంతి): జిల్లా లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ని వసించే ఆదివాసీ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారికి కనీస సౌకర్యాలను అందజేయటమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. బు ధవారం చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత సరిహద్దు గ్రామాలైన 20 గ్రామాలకు మినీ రైస్ మిల్లులను అందజేశారు.

ఈ సందర్భంగా రాళ్లపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎస్పీ , అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్, భద్రాచలం ఏఎ స్పీ విక్రాంత్ కుమార్ సింగ్ లు కూడా పా ల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు రూ 50 లక్షల వ్యయంతో 20 గ్రామాల ప్రజల కు అందుబాటులో ఉండే విధంగా మినీ రైస్ మిల్లులను ఏర్పాటు చేయడం జరిగిందన్నా రు.

మినీ రైస్ మిల్లు కొరకు ఏర్పాటు చేసిన షెడ్డుతో కలిపి ఒక్కో యూనిట్ విలువ రూ 2.50 లక్షలు ఖర్చుతో 20 గ్రామాలలో 20 యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాళ్లపురం గ్రామంలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ నిషేధిత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆది వాసీ ప్రజలకు విద్య,వైద్యం,రవాణా వంటి కనీస సౌకర్యాలతో పాటు మౌళిక సదుపాయాలను కూడా అందించటమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు.

త మ తమ గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్న పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, అట్టి సమస్యల పరిష్కారానికి సంబంధిత శా ఖల అధికారులతో మాట్లాడి కృషి చేస్తామన్నారు. ఏజెన్సీ గ్రామాలలోని యువత అన్ని రంగాల్లో ముందుండాలని తెలిపారు. రాళ్లపురం గ్రామం నుండి జాతీయ స్థాయిలో సె యిలింగ్ క్రీడలో పాల్గొన్న ఆడమయ్యను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అ న్నారు.

అనంతరం అడమయ్యను ఎస్పీ గ్రా మస్తుల సమక్షంలో ఘనంగా సన్మానించా రు. నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అ లాంటి అసాంఘిక శక్తులకు ఎవరూ సహకరించకూడదని తెలిపారు. తెలంగాణ ప్రభు త్వం తరపున పోలీసు శాఖ ఆదివాసి ప్రజలకు అందిస్తున్న అభివృద్ధిని, లొంగిపోయి న మావోయిస్టులకు కల్పిస్తున్న పునరావాస సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని మావోయిస్టు పార్టీలో పనిచేసే సభ్యులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.

రాళ్లపురం గ్రామం నుండి నిషేధిత మావోయిస్టు పార్టీ లో పని చేస్తున్న పొడియం లక్ష్మి కుటుంబా న్ని సందర్శించి,ఆమె కుటుంబ సభ్యులకు దుస్తులను అందజేశారు.ఆ గ్రామంలో ఏ ర్పాటు చేసిన మినీ రైస్ మిల్లును ప్రారంభిం చి,అట్టి మిషన్ పని చేసే విధానాన్ని ఎస్పీ పరిశీలించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం చర్ల మండల పరిధిలో ప్ర స్తుతం నిర్మాణంలో ఉన్న పలు అభివృద్ధి కా ర్యక్రమాలను పరిశీలించారు.ఈ కార్యక్రమం లో చర్ల సీఐ రాజు వర్మ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్త్స్రలు నర్సిరెడ్డి,కేశవ మరియు సిబ్బంది పాల్గొన్నారు.