28 March, 2026 | 2:08 PM

Breaking News

పత్తి గోదాంలో అగ్ని ప్రమాదం   •   ప్రభుత్వ స్థల వివాదం – గుడి నిర్మాణానికి అడ్డంకులు, అధికారులకు వినతి   •   తుంగతుర్తి లోక్‌అదాలత్‌లో ఒకటైన జంట   •   ఇంటింటికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ   •   సింగరేణి ఉత్పత్తి లక్ష్యంలో సత్తుపల్లి అగ్రగామి   •   ఏం అచ్చెమ్మ అత్త బాగున్నావా..! ఆప్యాయంగా పలకరించిన మంత్రి తుమ్మల   •   నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు: మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్   •   మూసీ నది పునరుజ్జీవనంపై సర్కార్ కీలక నిర్ణయం   •   ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ ప్రక్షాళన.. ఎవరైనా అడ్డుపడితే శివతాండవమే..!   •   చిత్తూరులో రోడ్డు ప్రమాదం... వరంగల్‌కు చెందిన కుటుంబం మృతి   •  

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

17-06-2025 08:38 PM

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి..

ఆరుట్ల, చెన్నారెడ్డి గూడ గ్రామాల్లో రూ.1.40 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం.. 

ఇబ్రహీంపట్నం: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నడుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి(MLA Malreddy Ranga Reddy) అన్నారు. మంగళవారం మంచాల మండలంలోని ఆరుట్ల, చెన్నారెడ్డి గూడ గ్రామాల్లో పర్యటించిన ఆయన రూ.1.40 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆరుట్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మొట్టమొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం, మంచాల మండల కేంద్రంలో మండలానికి చెందిన 435 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను, 53 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో వెనుక బడిన విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేయడానికి ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం చేయడానికి రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, రాష్ట్రంలో మొట్టమొదటగా ఆరుట్ల గ్రామంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, పాండురంగారెడ్డి, గుండెమోని జయమ్మ, మంచాల సహకార సంఘం చైర్మన్ వెదిరే హనుమంత్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సాతిరి ఎల్లేష్, కొర్ర పాండు మండల పార్టీ అధ్యక్షులు వింజమూరి రాంరెడ్డి, అధికారులు ఎమ్మార్వో ప్రసాదరావు, ఎంపీడీఓ బాలశంకర్, ఆరుట్ల స్కూల్ హెచ్ఎం గిరిధర్ గౌడ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుప్రియ తదితరులు పాల్గొన్నారు. అనంతరం.. ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో కొత్తగా ఏర్పాటైన 17 షెటర్లు ప్రారంభించారు.