11-08-2025 01:24:52 AM
శ్రీ షిర్డీ సాయి సేవ భజన మండలి ఆధ్వర్యంలో అల్పాహార వితరణ
మహబూబ్ నగర్ టౌన్ ఆగస్టు 10 (విజయ క్రాంతి) : శ్రీ షిరిడి సాయి సేవ భజన మండలి ఆధ్వర్యంలో నిరుపేదలకు కడుపు నింపడమే లక్ష్యంగా ఉచిత అల్పాహర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం రోజుపాలమూరు స్టేడియం రోడ్ వద్ద వున్నా చలి వేంద్రం వద్ద ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. తోచిన సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు.