calender_icon.png 13 August, 2025 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగుళాంబ దేవస్థాన అర్చకులకు నోటీసులు

11-08-2025 01:23:30 AM

అలంపూర్,ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్ లోని డోన్ పట్టణ సమీపంలో ఈ నెల 6న జరిగిన ఓ వివాహ రిసెప్షన్ వేడుకకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓ ప్రధాన పార్టీకి చెందిన నేత ఆహ్వానం మేరకు జోగుళాంబ ఆలయ అర్చకులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్న దృశ్యాలు పలు టీవీ ఛానల్ లో, వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.

దీంతో అర్చకులు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు స్పష్టమైంది.ఇట్టి ఘటనపైన దేవాదాయశాఖ సీరియస్ అయ్యింది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయ అర్చకులకు ఆలయ ఈవో పురేందర్ నోటీసులు జారీ చేసినట్లు ఆదివారంతెలిపారు.