31 March, 2026 | 1:44 AM

పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం

31-03-2026 12:07 AM

మేడ్చల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు: వేముల శ్రీనివాస్‌రెడ్డి

మేడ్చల్ అర్బన్ మార్చి 30(విజయక్రాంతి):పేదల జీవితాలలో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మేడ్చల్ మున్సిపల్  సర్కిల్  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ పేర్కొన్నారు. పేదల సొంతింటి కల ఇందిరమ్మ ప్రభుత్వంలో నేర వేరుతోందని  స్పష్టం చేశారు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ మున్సిపల్ వార్డుకు చెందిన కౌడే పద్మ శ్రీనివాస్ కురుమ నూతన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని పేదల కళ్ళల్లో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని  స్పష్టం చేశారు.ఇందిరమ్మ ఇళ్ళు లేని గ్రామాలు,పట్టణాలు లేవని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తున్నట్లు  తెలియజేశారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుర్గం శివశంకర్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి సంతోష్ గౌడ్.పానుగంటి మహేష్ కుమార్. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి.ఎన్‌ఎస్యుఐ అధ్యక్షులు గుండ శ్రీధర్ కురుమ.మున్సిపల్ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు దండు శ్రీకాంత్.గణపురం మల్లేష్ నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.