31 March, 2026 | 1:56 AM

విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు

31-03-2026 12:07 AM

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

జిల్లాలోని కేజీబీవీలు, టీజీఎంఎస్ రెసిడెన్షియల్ విద్యాలయాలు,

హాస్టళ్లకు 20 ఫ్రీజర్ల పంపిణీ

రాజన్న సిరిసిల్ల, మార్చి 30(విజయక్రాంతి): విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లాలోని జిల్లాలోని 13 కేజీబీవీలు, ఏడు టీజీఎంఎస్ హాస్టళ్లకు కలిపి 20 ఫ్రీజర్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక చొరవతో సమకూర్చారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ఆయా విద్యాలయాల బాధ్యులకు కలెక్టర్ సోమవారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మె నూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తుందని వివరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా జిల్లాలోని విద్యాలయాల విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు, సేవలు అందిస్తుం దని తెలిపారు. జిల్లాలోని రెసిడెన్షియల్ వి ద్యాలయాలు, హాస్టళ్లకు గత చలికాలంలో విద్యార్థులకు వేడి నీళ్లు అందించేందుకు ఇప్పటికే గీ జర్లు అందించామని గుర్తు చేశారు.

విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహార పదార్థాలను అందించేందుకు ఫ్రీజర్లు ఆయా రెసిడెన్షియల్ విద్యాలయాలు, హాస్టళ్ల బాధ్యులకు అందజేసినట్లు తెలి పారు.ఈ ఫ్రీజర్ల ద్వారా విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలు , కూరగాయలు పాడైపోకుం డా నిల్వ చేసుకోవచ్చనీ, పాలు, ఆకు కూరలు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు స్వచ్ఛంగా అందించే అవకాశం ఉందని తెలిపారు.రెసిడెన్షియల్ విద్యాలయాల్లో శుభ్రమైన ఆహారం పదార్థాలు అందించడం, వ్యర్థాల నిర్వహణ, వసతి గృహాలలో మెరుగైన జీవన వాతావరణం క ల్పించడానికి ఇన్సినరేటర్, వంటపాత్రలు కూడా గతంలో అందించారు.కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, జీసీడీవో పద్మజ, స్పెషల్ ఆఫీసర్స్, తదితరులు పాల్గొన్నారు.