11 July, 2026 | 1:52 AM

డ్రగ్ ఫ్రీ నవాబుపేట చేయడమే ధ్యేయం

11-07-2026 12:00 AM

ఎస్‌ఐ నరేందర్                                                                                                                      

నవాబ్ పేట, జూలై 10 : యువత భవిష్యత్తును పాడుచేస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఒక భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు, యువత, వ్యాపారులు,  ప్రజాప్రతినిధుల చురుకైన భాగస్వామ్యంతో సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ నరేందర్ మాట్లాడుతూ  మత్తు పదార్థాల అలవాటు ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాకుండా, వారి కుటుంబాలను, సమాజాన్ని తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ వంటి ఇతర మత్తు పదార్థాల విక్రయం, రవాణా, నిల్వ చేయడం, వాటిని వినియోగించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  ఈ కార్యక్రమం లో గ్రామస్థులు పాల్గొన్నారు.