నార్లాపూర్ పాఠశాలలో కూలిన పైకప్పు
11-07-2026 12:00 AM
తృటిలో తప్పిన ప్రమాదం
కొల్లాపూర్ రూరల్ జూలై 10: కొల్లాపూర్ మండలం నార్లాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉదయం ప్రమాదం తృటిలో తప్పింది. విద్యార్థులు అసెంబ్లీ కోసం బయట ఉండగా ఒక్కసారిగా తరగతి గది పైకప్పు స్లాబ్, గోడ కూలిపోయాయి. ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఎంఈఓ ఇమ్మానుయేల్ పాఠశాలను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.






