10 March, 2026 | 8:56 PM

81 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతి

09-03-2026 02:50 AM

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 81 మంది అధ్యాపకులకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పి స్తూ కళాశాల విద్యా కమిషనర్ శ్రీదేవసేన ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుదీర్ఘమైన బోధన సేవలు, పరిశోధన అనుభవాన్ని గుర్తించి ఇచ్చే ఈ ప్రొఫెసర్ పదోన్నతికి మల్టీ జోన్-1  నుంచి 38 మంది, మల్టిజోన్-2 నుంచి 43 మంది ఎంపికయ్యారు. రాష్ట్ర డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బ్రిజేష్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ సంగీ రమేష్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజయకుమార్ హర్షం వ్యక్తం చేశారు.