ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకెళ్లడమే లక్ష్యం
పలు అభివృద్ధి అంశాలను శాసనసభ దృష్టికి తీసుకువచ్చిన
శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
వనపర్తి, మార్చి 24 (విజయక్రాంతి): నపర్తి నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్న సంకల్పమే పరమావధిగా భావించి ప్రతిక్షణం అభివృద్ధి ఆలోచనలతోనే ముందుకు సాగుతున్నానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. ఈ క్రమంలో మంగళవారం ఎమ్మెల్యే పలు అభివృద్ధి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించారు. వనపర్తి నియోజకవర్గంలో ప్రాజెక్టు, పలు రహదారుల అభివృద్ధి కోసం రూ. 400 కోట్లతో టెండర్లు పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఇందులో భాగంగా వనపర్తి గోపాల్పేట్ బిజినపల్లి వరకు , వనపర్తి ఘణపురం మొల్గర వరకు , వనపర్తి కొత్తకోట వరకు నాలుగు లైన్ల రహదారి, వనపర్తి పట్టణ శివారు వరకు రహదారి విస్తరణ కొరకు సంబంధించిన డ్రైనేజీల నిర్మాణం కోసం 25 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అదేవిదంగా పెబ్బేరు మున్సిపాలిటీ కోసం మరో 5 కోట్లు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు.
వనపర్తి నుంచి పెబ్బేరు మున్సిపాలిటీకి ఉన్న 20 కిలోమీటర్ల పొడవున్న రహదారిని నాలుగు లైన్ల రహదారిగా మార్చాలని ఆ రహదారి కర్నూలుకు లింక్ అయి ఉండటం వల్ల హెవీ ట్రాఫిక్ ఉంటుందని దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సంబంధిత మంత్రులకు సమర్పించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్ ఎన్ బి సంబంధించి ఎస్సీ కార్యాలయం నిర్మాణం చేపట్టేందుకు సంబంధించిన నివేదికలను మంత్రి కి అందించినట్లు అందుకు సంబంధించింది మంజూరి చేయవలసిందిగా ఎమ్మెల్యే కోరారు.




