నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం
నాగోల్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): నాగోల్ బండ్లగూడ రోడ్డులో డా. శ్రీను చంద్రాస్ ఆధ్వర్యంలో స్కిన్హీల్ క్లినిక్ & మల్టీస్పెషాలిటీ కేర్ కేంద్రాన్ని ఘనంగా ప్రారం భించారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో నూతన సదుపాయాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ క్లినిక్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా. సత్యనారాయణ రావుల పాల్గొని మాట్లాడుతూ, తమకు ఉన్న ఎస్‌ఎంఎస్ (జనరల్ సర్జరీ), ఎంఎస్ (పీడియాట్రిక్ సర్జరీ), పీడియాట్రిక్ యూరాలజీ (కెనడా)లో ఉన్న అనుభవంతో పిల్లల శస్త్రచికిత్సలు, యూరాలజీ సేవలను అత్యాధునిక పద్ధతుల్లో అందిస్తామని తెలిపారు. తాము ఎఫ్‌ఐఏజిఎస్, ఎఫ్‌ఎంఏఎస్ అర్హతలతో పాటు లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీల్లో నైపుణ్యం కలిగి ఉన్నామని చెప్పారు.
అదేవిధంగా డా. శ్రీను చంద్ర తిరగాటి (ఎంబిబిఎస్, ఎండి డివిఎల్ గోల్ మెడలిస్ట్) మాట్లాడుతూ, చర్మ సంబంధిత సమస్యలు, జుట్టు సమస్యలకు ఆధునిక లేజర్, డెర్మటోసర్జరీ విధానాలతో చికిత్సలు అందిస్తామని తెలిపారు. ఈ క్లినిక్లో క్లినికల్ & కాస్మెటిక్ డెర్మటాలజీ, స్కిన్ & హెయిర్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
ఈ మల్టీస్పెషాలిటీ కేంద్రంలో చర్మ శాస్త్ర చికిత్సలు, పిల్లల శస్త్ర చికిత్సలు, చర్మం మరియు జుట్టు సంబంధిత అన్ని రకాల సేవలు ఒకే చోట అందించబడనున్నాయి. స్థానిక ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించ డంలో ఈ క్లినిక్ కీలక పాత్ర పోషించనుంది.






