16 April, 2026 | 4:37 AM

విద్యా వ్యవస్థలో సమూల మార్పే లక్ష్యం

23-11-2025 12:00 AM
  1. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో అగ్రగామిగా తెలంగాణ
  2. యువతకు స్కిల్లింగ్, రీ- స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్‌పై దృష్టి
  3. ‘జేఎన్టీయూహెచ్ గ్లోబల్ అల్యూమ్ని మీట్’లో మంత్రి శ్రీధర్ బాబు 

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి) : విద్యా వ్యవస్థలో సమూల మార్పు తేవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.  నేటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను అత్యుత్తమ నైపుణ్యమున్న మానవ వనరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్కిల్లింగ్, రీ- స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించామని పేర్కొన్నారు.

కూకట్ పల్లిలోని జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ‘జేఎన్టీయూహెచ్ గ్లోబల్ అల్యూమ్ని మీట్ - 2025’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని వివరించారు. క్వాం టం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేలా ఎకో సిస్టంను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

‘ఏఐ’లో బెంచ్ మార్క్ ను సెట్ చేసేలా అంతర్జాతీయ నిపుణుల భాగస్వామ్యంతో త్వరలోనే ‘తెలంగాణ ఏఐ ఇన్నో వేషన్ హబ్’ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. మనం జీవితంలో ఎంత ఎత్తు కు ఎదిగినా మూలాలను మరిచిపోవద్దని, స మాజానికి తిరిగి ఇవ్వడం కృతజ్ఞతతో కూడిన బాధ్యత అని పేర్కొన్నారు. మనం మన విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ప్రశ్నించే అవకాశాన్ని పొందగలమని తెలిపారు.

జేఎన్టీయూహెచ్‌లో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఫండింగ్, రీసెర్చ్ క్లస్టర్స్, ఇంటర్నేషనల్ మెంటార్ షిప్ నెట్ వర్క్స్, గ్లోబల్ అల్యూమ్ని కౌన్సిల్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పూర్వ విద్యార్థులను కోరారు. ఈ ప్రక్రియలో రాష్ర్ట ప్రభు త్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

యువ ఇంజనీర్ల ఆలో చనా విధానం మారాలని, ఉద్యోగార్థిగా కాకుం డా పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని మార్గనిర్దేశం చేశారు. కేవలం పుస్తక జ్ఞాన మే కాకుండా ప్రాక్టికల్, ప్రాబ్లం సాల్వింగ్ స్కి ల్స్‌ను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హ య్యర్ ఎడ్యుకేషన్ చైైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టి.కి షన్‌కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వెంకటేశ్వరరావు, రెక్టార్ డా.కే.విజయ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.