13 April, 2026 | 11:53 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

ప్రజా సంక్షేమమే ప్రజా పాలన లక్ష్యం

16-06-2025 11:35 PM

కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి..

మోతె: ప్రజల సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యం మని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి(MLA Uttam Padmavathi Reddy) అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పద్మావతి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. అనంతరం శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మండలంలో సాగు నీటికి కొరత లేకుండా చేసి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ యంపిపి ముప్పాని ఆశ శ్రీ కాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామ చిన్న వెంకట్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ బాణోతూ మాతృ నాయక్, బొడ్డు సాలయ్య, వెంకన్న, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క ఉపేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు దేశ బోయిన నాగరాజు, జలగం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.