13 April, 2026 | 1:44 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

తల్లీకూతుళ్లు అదృశ్యం

17-06-2025 12:00 AM

ఎల్బీనగర్, జూన్ 16 : తల్లీకూతుళ్లు అదృశ్యమైన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి తన భార్య మానస, పసుశ్రుత మరియు తేజస్విని ఇద్దరు కూతుర్లు కనిపించకుండా పోయారంటూ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భర్త రవీందర్ రెడ్డి పోలీసులు తెలిపిన వివరాలు...

పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ సాయి నగర్ కాలనీకి చెందిన తుమ్మలపల్లి రవీందర్ రెడ్డికి మానస తో 20 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు కూతుళ్లు సుశ్రుత(18), తేజస్వి(16) ఉన్నారు. కాగా, రవీందర్ రెడ్డి నెల రోజుల క్రితం తిరుమలగిరి సూర్యాపేట జిల్లాకి వెళ్లాడు. 10 రోజుల తర్వాత భార్యకి ఫోన్ చేసి వేసవి సెలవులు ఉన్నారని, పిల్లలని తీసుకొని సొంత ఊరు నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రేవల్లి గ్రామానికి రావాలని కోరాడు.

సొంత ఊరికి రానని మొండికేసింది. దీంతో రవీందర్ రెడ్డికి కోపం వచ్చి డబ్బులు పంపడం ఆపేశారు. ఈ క్రమంలో రవీందర్ రెడ్డి 11వ తేదీన సాయినగర్ కు వస్తున్నానని మానసకి చెప్పి, వచ్చాడు. 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. మానస, ఇద్దరు కూ తుళ్ల గురించి ఇంటి యజమానిని అడగగా వాళ్లు బట్టలు సర్దుకుని వెళ్లారని చెప్పాడు.

వాళ్ల గురించి బంధువుల దగ్గర వెతికినా ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో రవీందర్ రెడ్డి హ యత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజుగౌడ్‌తెలిపారు.