16 April, 2026 | 11:25 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

జెడ్పీ డిప్యూటీ సీఈఓకు ఉద్యోగ విరమణ సన్మానం

02-03-2026 01:15 AM

దోమకొండ,మార్చి 1 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా పరిషత్ డిప్యూటీ సిఈఓగా పనిచేసిన కే రాజ్ వీర్ నకు ఆదివారం దోమకొండ సర్పంచ్ ఐరేణి నర్సయ్య, మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ పదవీ విరమణ సన్మానం చేశారు.  డిచ్ పల్లి ఎంపీడీవోగా విధులు నిర్వహించి, గత నాలుగు రోజుల క్రితం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ గా పదోన్నతి పొందారు. 

వీడీవోగా ఉద్యోగంలో చేరి, అంచెలంచెలుగా జెడ్పి డిప్యూటీ సీఈఓ వరకు సేవలందించారని వారన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు, ప్రజా సేవలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. గ్రామం నుండి జిల్లా స్థాయి అధికారిగా ఎదగడం గ్రామానికే గర్వకారణం అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మర్రి శేఖర్, నేతుల సుధాకర్, అబ్రబోయిన రాజేందర్, పిన్నెం రామచంద్రం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.