calender_icon.png 23 February, 2026 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాధికారమే బీసీల లక్ష్యం

23-02-2026 02:21:02 AM

ముఖ్యమంత్రి పదవి దక్కకుండా కుట్రలు

ఏపీలో బీసీ రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి

రామచంద్ర యాదవ్ పోరాటానికి మద్దతు

పాలకవర్గాలపై బడుగుల తిరుగుబాటు మొదలైంది

బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో బీసీల ఆత్మగౌరవ పోరాటం కొత్త పుంతలు తొక్కుతోందని, తమ హక్కుల సాధన కోసం పాలకవర్గాలపై బడుగు బలహీన వర్గాలు తిరుగుబాటు మొదలుపెట్టాయ ని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ స్పష్టం చేశారు.

బీసీలంతా రాజకీయ బానిసత్వం నుంచి బయటికి రావాలని, బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆది వారం మంగళగిరిలో బీసీవై పార్టీ ఆధ్వర్యం లో నిర్వహించిన బీసీల సింహగర్జన కార్యక్రమానికి ఆయన తన రాష్ట్ర కార్యవర్గంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భం గా సభ ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గతం లో తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం స్వర్గీయ ఎన్టీ రామారావు కొనసాగించిన పోరాటమే నేడు బీసీలు నిర్వహిస్తున్న రా జ్యాధికార పోరాటానికి పునాది అని ఆయన అభివర్ణించారు. బీసీలే లేకపోతే పండుగలే లేవన్నారు. సమాజ గమనంలో బీసీల పాత్రను దాసు సురేశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బీసీలే లేకపోతే, బీసీలు తయారు చేసే ఉత్పత్తులు లేకపోతే.. ఆఖరికి దేవుళ్లకు సైతం పండుగలు జరిగే పరిస్థితి లేదు. సమాజానికి వెన్నెముకగా ఉన్న బీసీలంతా ఇప్పు డు ఏకం కావాలి. కులాల వారీగా విడిపోకుండా.. మనదంతా ఒకే కులమని, అదే బీసీ కులం అని చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో నేటికీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాకపోవడం వెను క పెద్దకుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. ఈ రాజకీయ బానిసత్వం నుంచి విముక్తం కావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

బీసీల హక్కుల కోసం రామచంద్ర యాదవ్ కొనసాగిస్తున్న పోరాటానికి బీసీ రాజ్యాధికార సమితి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు దాసు సురేశ్ వెల్లడించారు. తెలంగా ణలో తాము చేసిన నిర్విరామ పోరాట ఫలితంగానే ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో బీసీలు తమ జనాభా శాతాన్ని మించిన ఫలితాలను సాధించగలిగారని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని కోరారు. బీసీల నిరంతర ఒత్తిడి వల్లే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త కులగణనకు మొగ్గు చూపుతోందని ఆయన విశ్లేషించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని దాసు సురేశ్ డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్రంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. సమగ్ర కులగణన చేప ట్టి జనాభా ప్రాతిపదికన నిధులు, పదవులు కేటాయించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ తులసీ శ్రీమన్, ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ ఎం రవీంద్రకుమార్, సంస్థ సీఈఓ గోశాల సరస్వతి, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.