24-04-2025 12:00:17 AM
డీసీఆర్బీ డీఎస్పీ మట్టయ్య, రూరల్ సీఐ రాజశేఖర్...
పెన్ పహాడ్: పిల్లల బంగారు భవిష్యత్ వారి తల్లిదండ్రుల చేతిలో ఉందని డీసీఆర్బీ డీఎస్పీ మట్టయ్య, రూరల్ సీఐ రాజశేఖర్ అన్నారు. బుధవారం రాత్రి సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనాజీపురం గ్రామంలో జిల్లా ఏస్పీ ఆదేశాల మేరకు 'ప్రజా భరోసా' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా యువత గంజాయి, బెట్టింగ్స్ భారిన పడకుండా ఉండాలని అందుకు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే పలు చట్టాలపై అవగాహనా పెంచుకోవాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువులో పుస్తకాలపై ఆశక్తి పెంపొడించుకోవాలని కోరారు. పోలీస్ సిబ్బంది చేసిన కళాజాత పలువురిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎస్ఐ గోపిక్రిష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.