calender_icon.png 10 May, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్‌లో 1275 కేసులు నమోదు..

23-04-2025 11:57:40 PM

35 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): నగరంలో మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో ట్రాఫిక్ పోలీసులు 1275 కేసులు నమోదు చేశారు. 35 వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. మరి కొన్ని వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అవకాశం ఉంది. ఆర్టీఏకు ట్రాఫిక్ పోలీసులు ప్రతిపాదనలు పంపారు. ఈ నెల 4 నుంచి చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ డి.జోయెల్ డేవిస్ గతంలోనే తెలిపారు. మోటారు వాహనాల చట్టం 1988 సెక్షన్ 199ఎ ప్రకారం మైనర్లు వాహనాలు నడపడం నిషేదం, ఉల్లంఘించిన మైనర్, తండ్రి, సంరక్షకులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. మైనర్లు డ్రైవ్ చేస్తూ పోలీసులకు దొరికితే నిబందనల ప్రకారం వారికి 25ఏండ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అనర్హులవుతారు.