18 April, 2026 | 2:09 AM

పెద్ద వాగు ప్రాజెక్ట్ పునః నిర్మాణం చేపట్టాలి

18-04-2026 12:32 AM
  1. సీపీఐ  జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా
  2. అశ్వారావుపేట పెద్దవాగు ప్రాజెక్టు 
  3. పునః నిర్మాణంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు విఫలం
  4. రూ.98 కోట్లతో ప్రాజెక్ట్ మరమ్మతులు చేపట్టలేరా..?
  5. తెలంగాణ మంత్రుల హామీలు నీటి మీద రాతలేనా..?

అశ్వారావుపేట, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని  మధ్య తరహా ప్రాజెక్ట్ అయిన పెద్ద వాగు ప్రాజెక్టు గండి పడి రెండు ఏళ్లు పూర్తి.ఇప్పటికి పునః నిర్మాణం చేపటక పోవడం తో ఏ పి, తెలంగాణ రాష్ట్రాల సి పి ఐ నాయకులు పెద్ద వాగు ప్రాజెక్టు నుండి ఆంధ్రా లోని వేలేరుపాడు వరకు నిరసన పాదయాత్ర  ను శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా సి పి ఐ నాయకులు  జి ఈశ్వరయ్య.

షేక్ సాబీర్ పాషా మాట్లాడుతూ పెద్దవాగు ప్రాజెక్ట్ వరద కు కొట్టకు పోయి దాదాపు రెండు ఏళ్ళు అవుతున్న నేటివరకు ప్రాజెక్టు పుననిర్మాణం చేపట్టలేక పోవటం అంటే ప్రభుత్వం వైపుల్యం చెందినది వారు అన్నారు. పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్టు 82 శాతం ఆంధ్రప్రదేశ్ రైతులకు తెలంగాణ రైతులకు 18 శాతం ఆయకట్టు ఉన్నది అని  ప్రాజెక్ట్ పునః నిర్మాణం కోసం 92 కోట్లు ఎస్టిమేషన్ చేసి నిధులు మంజూరి చెయ్యకుండా నిద్రపోతున్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయడు. డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు గిరిజన రైతులకు సాగునీరు అందించటం కోసం నిధులు మంజూరి చెయ్యరా అని ప్రశ్నించారు. రెండు ఏళ్ళు నుండి పంటలు సాగు చెయ్యక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కట్ట తెగిపోతే తెలంగాణ ప్రభుత్వం రింగు బండ కోసం 3 కోట్ల పై చిలుకు ఖర్చు పెట్టినా నిరుపయోగం  ఉందన్నారు.

తక్షణమే 92 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని, కొత్తగా ఐదు   లాకులు. ఏర్పాటు చెయ్యాలి అని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సిపిఐ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ,సిపిఐ  భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబిర్ పాషా-సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ,సిపిఐ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశ్వనాథం ,సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ డి సలీం నరాటి ప్రసాద్ ,కారం ధారయ ,బాడిశ రాము ,పిట్టా ప్రసాద్,  సిపిఐ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.