పేదల ఉసురుతో ప్రభుత్వ పతనం
- దానం చేసిన భూమిని లాక్కునే హక్కు ఎవరిచ్చారు?
- కూల్చివేతలకే రేవంత్‌రెడ్డి పాలన పరిమితం
- బాధితులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి
- నియంతల కంటే దారుణమైన అహంకారం
- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
- వెలుగుమట్ల భూబాధితులకు పరామర్శ
- గోస విని కన్నీళ్లు పెట్టుకున్న ఈటల
- బాధితులకు స్వయంగా భోజనం వడ్డింపు
ఖమ్మం, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): ‘నిరుపేదలకు దానం చేసిన భూమిని దౌర్జన్యంగా లాక్కునే హక్కు కాంగ్రెస్ పాలకులకు ఎవరిచ్చారు? కనీస కనికరం లేకుండా నిద్రమత్తులో ఉన్న అభాగ్యుల ఆవాసాలను నేల మట్టం చేసిన ముఖ్యమంత్రి తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవనంలో తలదాచుకుంటున్న భూదా న్ బాధి తులను ఆయన పరామర్శించి, అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఆకలితో అలమటిస్తున్న బాధితులకు బీజేపీ ఆధ్వర్యంలో భోజన సదుపాయం ఏర్పాటు చేశా రు. ఈటల రాజేందర్ స్వయంగా అభాగ్యులకు భోజనం వడ్డించి వారి కన్నీళ్లు తుడి చారు. వారి గోసను విని ఈటల కూడా కన్నీ ళ్లు పెట్టుకున్నారు. కష్టకాలంలో పేదల పక్షా న బీజేపీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 62 ఎకరాల భూదాన్ భూమిలో 32 ఎకరాల్లో పేదలు తలదాచుకుంటుంటే అమానుషంగా లాక్కున్న అధికార పక్షం, మిగతా 30 ఎకరాల భూమిని ఏ బడాబాబులకు కట్టబెట్టిం దో, ఆ భూమి ఏమైందో తక్షణమే లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.
వెలుగుమట్ల ప్రాంతంలో అమాయక ప్రజల కన్నీళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లెదుటే గుడిసెలు కూలిపోయి బతుకులు రోడ్డున పడటంతో ఈ ప్రభుత్వం సర్వనాశనం కావాలని బాధితులు శాపనార్థాలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానం మినహా అన్ని స్థానాలను అధికార పక్షానికే కట్టబెట్టారని, కీలక మంత్రి పదవులు కూడా ఈ జిల్లాకే దక్కాయని గుర్తుచేశారు.
పలువురు మంత్రులు ఉన్నా తమకు న్యాయం జరుగుతుందని జనం ఎంతో సంబురపడ్డారని, కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే దారుణంగా తమ ఇళ్లనే కూల్చివేస్తారని నిరుపేదలు ఏనాడూ ఊహించలేదని విమర్శిం చారు. మొదట్నుంచీ కాంగ్రెస్ దమననీతినే కొనసాగిస్తోందని మండిపడ్డారు.
‘భూదాన్’పై స్పృహ లేదా?
భూదాన్ భూమి అంటేనే నిరుపేదలకు దానం చేసిన భూమి అని పాలకులకు కనీస స్పృహ లేదా అని ఈటల రాజేందర్ నిలదీశారు. వినోబా భావే వేలాది ఎకరాలను దానం చేశారని అందులో భాగంగానే సర్వే సంఖ్య 147, 148, 149లలో 62 ఎకరాల భూదాన్ భూమి ఉందని స్పష్టం చేశారు. ఆనాడు ఈ భూములను ఎవరూ పట్టించుకోలేదని కానీ నేడు ఆ ప్రాంతంలో భూము ల ధరలు విపరీతంగా పెరగడంతో బడాబాబుల కన్ను పడిందని ఆరోపించారు. ముఖ్య మంత్రి రేవంత్ పాలన కేవలం కూల్చివేతలకే పరిమితమైందని ధ్వజమెత్తారు.
నిరుపేదలకు భూములు పంచడం చేతకాని ఈ ప్రభు త్వానికి ఉన్న భూములను కబ్జా చేయడం లాక్కోవడం మాత్రమే తెలుసునని తీవ్రంగా విమర్శించారు. 2019లోనే న్యాయమూర్తి చల్లా కోదండరాం పేదలకు విద్యుత్తు, నీళ్లు ఇవ్వాలని ఆదేశించినా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈనాటి ప్రభుత్వం ఆ కనీస వసతులు కల్పించకపోగా దౌర్జన్యంగా ఇళ్లను కూడా లాక్కుందని మండిపడ్డారు.ఏ న్యాయస్థానం ఇళ్లు కూల్చమని ఆదేశాలు ఇచ్చిందని రక్షక భటులతో వెళ్లి బలవంతంగా ఇళ్లు లాక్కున్నారని ప్రభుత్వాన్ని ప్ర శ్నించారు.
పేదల గుడిసెలు కూల్చిన పాలకులకు కబ్జా చేసిన బడాబాబుల వద్ద ఉన్న వందలాది ఎకరాల భూములు వెనక్కి తీసుకునే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వం పేదల కళ్లలో మట్టి కొట్టిన అత్యం త దుర్మార్గపు ప్రభుత్వమని విమర్శించారు. జిల్లాలో ఉన్న భూదాన్ భూముల వివరాలు మొత్తం వెంటనే బహిర్గతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కనీస కనికరం లేకుండా పేదల ఆవాసాలను కూల్చివేసి తప్పు జరిగినందుకు సీఎం బాధితులకు క్షమాపణ చెప్పాలన్నారు. పేదలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ఈ పార్టీ పేరుకు మాత్రమే పేదల పార్టీ అని చేతల్లో మాత్రం రాక్షస పార్టీ అని విమర్శించారు. తక్షణమే ప్రభు త్వం స్పందించి బాధితులకు సత్వర న్యా యం చేయాలని, కూల్చిన చోటే ఇళ్లు కట్టిం చి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈటల వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి వాసుదేవరావు, గల్లా సత్యనారాయణ, నాయకులు ఉన్నారు.




