14 August, 2026 | 8:09 PM

Breaking News

నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు ఎప్పుడు..?   •   గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం   •   చందూర్ మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి   •  

పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

27-04-2026 12:36 AM

మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ టౌన్ ఏప్రిల్ 26 నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని చుక్కాయిపల్లిలో లబ్ధిదారుల నూతన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం రూ.19 లక్షలతో నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్కు భూమి పూజ నిర్వహించారు.

మొదటి విడతలో మంజూరైన ఇండ్లను ప్రారంభోత్సవం చేస్తున్నామని, త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను కూడా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యం, వైస్ చైర్మన్ షేక్ రహీం భాషా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బచ్చలకూర బాలరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపుల నరసింహ తదితరులు పాల్గొన్నారు.