తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్
10-04-2026 02:27 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనుమకొండ జిల్లా ఐలోని మండలం పున్నెలులో స్విమ్మింగ్ పూల్ లోకి తోసి తల్లి, ఇద్దరు పిల్లల హత్య చేసిన ఘటనలో భర్త తోపాటు పదిమందిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. తన భార్య ఆడపిల్లలకు జన్మనిస్తోందని, పుత్ర సంతానం కాంక్షతో మరో మహిళలు వివాహం చేసుకోవడానికి భార్యా పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించి వారిని భర్త హత్య చేసినట్లు వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. అలాగే అజారుద్దీన్ భార్య ఫరహాత్ గర్భాధారణ సమయంలో పుట్టబోయేది ఆడ మగ తెలుసుకోవడానికి సహకరించిన స్కానింగ్ సెంటర్ల యజమానులు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఈ ఘటనకు తోడ్పడ్డారని సీపీ తెలిపారు.




