16 May, 2026 | 1:47 AM

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం

16-05-2026 12:39 AM
  1. మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
  2. కొండమల్లెపల్లిలో బీఆర్‌ఎస్ నేతల ఆందోళన

దేవరకొండ, మే 15 (విజయక్రాంతి): ధా న్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫ లం అయిందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం కొండమల్లెపల్లిలో ధాన్యం కొనుగో లును ఆటంకాలు లేకుండా నిర్వహించాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. రైతులు 40 రోజులు గా కొనుగోలు కేంద్రాల వద్దే ఎదురుచూస్తూ ఇబ్బందులు పడుతున్నారని, నెలరోజులుగా తమ పంటను అమ్ముకోలేక నష్టపోతున్నారన్నారు.

బ్యాగులు లేకపోవడం, కాంటా సదు పాయం లేకపోవడం, లారీలు రాకపోవడం తో కొనుగోళ్లు పూర్తిగా స్థంభించాయని పేర్కొన్నారు. యూరియా కొరతతో రైతులను లైన్లలో నిలబెట్టారని, తరుగు పేరుతో ప్రభుత్వం 2 కిలోలు, మిల్లర్లు 3 కిలోలు వడ్లు కోత విధిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.