1 May, 2026 | 3:33 AM

దేశ భవిష్యత్ రూపుదిద్దుకునేది తరగతి గదుల్లోనే..

01-05-2026 12:41 AM

విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేందుకు ప్రభుత్వం కృషి

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

దేవరకొండ, ఏప్రిల్ 30: దేశ భవిష్యత్తు రూపుదిద్దుకునేది తరగతి గదుల్లోనే అని, అది గుర్తించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

కొండమల్లేపల్లి మండలం కోల్ ముం తల్ పహాడ్ గ్రామంలోని రైతు వేదిక వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్య యంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులకు శాసన మండలి సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ లతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం  అన్న లక్ష్యంతో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ప్రతి నియోజకవర్గంలో ఒక పాఠశాల ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.దేవరకొండలో నిర్మిస్తున్న ఈ పాఠశాల భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల ప్రాంగణంలోనే నివసించేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.పనులు వేగంగా సా గేందుకు ప్రతి పదిహేను రోజులకు నిధులు విడుదల చేస్తున్నామన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఆహార వ్యయాన్ని 40 శాతం, ఇతర అవసరాల ఖర్చును 200 శాతం పెంచినట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు తెలుసుకునే విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌక ర్యాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల ప్రయాణ సౌలభ్యం పెరుగుతుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది దోహదపడుతుందన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

అనంతరం కొండమల్లేపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్ర హరీ గోడకు కూడా శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ చైతన్య శ్రీ నివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు నాయిని జమున మాధవరెడ్డి, దొం తం అలివేలు సంజీవరెడ్డి, అధికారులు, ప్ర జాప్రతినిధులు, గ్రామ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.