28 April, 2026 | 1:24 AM

మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు...

28-04-2026 12:00 AM

అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ 

వనపర్తి, ఏప్రిల్ 27 ( విజయక్రాంతి ) : జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ బాలల భద్రత, రక్షణ, మాదకద్రవ్యాల వ్యతిరేక సంక్షేమ వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, డీఎస్పీ బాలాజీ నాయక్ హాజరయ్యారు.

అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే రెండో తేదీ వరకు ప్రభుత్వం బాలల భద్రత, రక్షణ, మాదకద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ చేతుల మీదుగా బాలసదనం చిన్నారులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పత్రాలను జారీ చేయడంతో పాటు, స్పోరట్స్ కిట్ ను కూడా అందజేశారు. సమావేశంలో జడ్పి సీఈవో యాదయ్య, డి ఆర్ డి ఓ ఉమాదేవి, డిసిపిఓ రాంబాబు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.