28 April, 2026 | 1:52 AM

ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం: జాజుల

28-04-2026 12:00 AM

ముషీరాబాద్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): బీసీ కులగణనపై బీజేపీ సమాధానo ఇవ్వకుంటే మే10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టబోయే తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.  సోమవారం హైదరాబాద్ లోని బీసీ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షత వహించగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.  ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా జాతీయ జన గణనలో దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇవ్వడం బీసీలను నమ్మించి మోసం చేయడమేనని అన్నారు.

ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కే. వీరస్వామి, గొడుగు మహేష్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, కే. వెంకటేష్ గౌడ్, జిల్లల నరసింహ,  నరసింహ చారి, బ్రహ్మచారి, గోల్నాక వెంకటేష్, బండి గారి రాజు గౌడ్, గూడూరు భాస్కర్ పాల్గొన్నారు.